Header Banner

నిన్నటి విధ్వంసం నుంచి.. రేపటి వికాసం వైపు ప్రయాణం! ఆంధ్రులు గర్వపడేలా అమరావతి!

  Mon Apr 28, 2025 10:24        Politics

నిన్నటి విధ్వంసం నుంచి.. రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునః ప్రారంభమయ్యే రోజు.. రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. మే 2న రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో ఆదివారం సాయంత్రం సమీక్షించారు. 'ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైకాపా ప్రభుత్వం విధ్వంసం చేసింది. నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి.. ఒక అద్భుత రాజధానిని నిర్మించి, విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నాం' అని స్పష్టం చేశారు. 'గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసింది. అయితే అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి.. వాటన్నింటినీ తట్టుకుని నిలబడింది.

 

ఇది కూడా చదవండి: మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

గత ప్రభుత్వ విధ్వంసం కారణంగా ఎదురైన సవాళ్లను.. కూటమి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే పరిష్కరించి.. నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నాం' అని సీఎం వివరించారు. నాది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ చెప్పేలా అమరావతి నిర్మాణం జరుగుతోందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తితో ఉన్నారని.. దిల్లీ భేటీ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారని వివరించారు. 'అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్.. దీన్ని ఎవరూ దెబ్బతీయలేరు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా, అన్ని వర్గాల ప్రజలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుంది. ప్రజారాజధాని అనే ఆంధ్రుల స్వప్నాన్ని కుట్రలు, కుతంత్రాలతో ఎవరూ దెబ్బతీయలేరని చెప్పేందుకే.. మళ్లీ దేశం అంతా గుర్తించేలా అమరావతి పనులను ప్రధాని చేతుల మీదుగా పునఃప్రారంభింపజేస్తున్నాం' అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలని ఆదేశించారు. రాజధాని పనుల పునః ప్రారంభ సభకు హాజరయ్యే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులు ఆయనకు ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 'ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలి. భద్రతాపరంగా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకోవాలి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజలకు ఎక్కువ భాగస్వామ్యం ఉంటుంది. వారంతా సభకు రావాలని భావిస్తారు. రవాణా సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు వారికి సూచనలు, ప్రకటనలు చేయాలి. వారికి ఇబ్బంది కలగకుండా చూడాలి' అని సూచించారు. సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, మనోహర్, సత్యకుమార్తోతోపాటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations